Telugu News Power

చిన్నారిపై అఘాయిత్యం కేసులో నిందితుడి షాపు కూల్చివేత.

పోలీసుల ఆధ్వర్యంలో నిందితుడి షాపు కూల్చివేత

ఆచంట: ఏప్రిల్, 10(తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో జరిగిన దారుణం పై పోలీసులు స్పందించారు. ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన వెలగన వెంకటస్వామి (70) షాపును పోలీసులు శుక్రవారం జెసిబి చేత నేలమట్టం చేయించారు.్ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు అత్యంత కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు.
నిందితుల అక్రమ కట్టడాలు, ఆస్తులపై చర్యలు తీసుకోవడం ద్వారా నేరగాళ్లకు గట్టి హెచ్చరిక పంపాలని పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
పోక్సో కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు, అతని కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కామాంధులకు ఇదొక హెచ్చరిక అని, ఆడపిల్లలపై ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడితే, చట్ట ప్రకారం చర్యలు తీవ్రంగా ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు.