Telugu News Power

చిరంజీవికి ఎన్టీఆర్ పురస్కారం.

నిర్మాత బన్నీ వాసు

హైదరాబాద్: మార్చి,7(తెలుగు న్యూస్ పవర్. కామ్) మెగాస్టార్ చిరంజీవిని, తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఆర్ జాతీయ పురస్కారానికి ఎంపిక చేసింది. గద్దర్ అవార్డ్స్ ప్రకటన సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది. ఇందుకు సంబంధించి పలువురు చిత్ర పరిశ్రమ, రాజకీయ ప్రముఖులు శనివారం శుభాభినందనలు తెలియజేశారు. మాజీ మంత్రి చిరంజీవి ఇంటికి స్వయంగా వెళ్లి అభినందించారు.
బన్నీ వాసు కు రెండు అవార్డులు: అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న, పాలకొల్లు వాసి,గవర (బన్నీ) వాసు నిర్మాణ సారథ్యం వహించిన రెండు చిత్రాలు, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ అందుకున్నాయి. ఉత్తమ చిత్రంగా, రాజు రాంబాయి, ఉత్తమ హీరోగా తండెల్ చిత్రంలో నటించిన నాగచైతన్య దక్కించుకున్నారు.