చిలుకూరు: ఫిబ్రవరి,28(తెలుగు న్యూస్ పవర్) వీసా గాడ్ గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన, ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం, హైదరాబాద్ సమీపంలో గల శ్రీ చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు సుందర రాజన్ మరణ వార్త శనివారం భక్తులను శోకసముద్రంలో ముంచింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా, రిజిష్ర్టార్ గా ఉన్నత పదవుల్లో ఆయన పని చేశారు. తదుపరి వారు ఆధ్యాత్మికత వైపు అడుగులు వేశారు. ఆలయ అర్చకులుగా విశేష ఆదరణ పొందారు. ఆధ్యాత్మిక విషయాలపై లోతైన అవగాహన తో అనేక ఆధ్యాత్మిక సందేహాలకు సమాధానం ఇచ్చేవారు. వారి మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుల నిర్యాణం.
దివంగత అర్చకులు సౌందర్ రాజన్