Telugu News Power

ఛాంబర్స్ కళాశాలలో “స్థానికపాలన-ఆధునికపోకడలు” పై సదస్సు.

సభలో ప్రసంగిస్తున్న ముఖ్య అతిథి.
సభకు హాజరైన, ప్రముఖులు, విద్యార్థులు.

పాలకొల్లు: ఫిబ్రవరి,12(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఛాంబర్స్ కళాశాల ప్రాంగణంలో, గురువారం, ప్రకాశం ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్, హైదరాబాద్ వారి సౌజన్యంతో “స్థానిక పాలనలో ఆధునిక పోకడలు” అనే అంశంపై సదస్సు జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన టంగుటూరి శ్రీరామ్, వేమూరి ఆనంద సూర్య, ఛాంబర్స్ కళాశాల చైర్మన్ శ్రీ కె.వి.ఆర్ నరసింహారావు జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సు ప్రారంభించారు. ఈ సందర్భంగా టంగుటూరి శ్రీరామ్ మాట్లాడు, ప్రపంచవ్యాప్తంగా స్థానిక సంస్థలలో సుపరిపాలన, ఈ – గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్ పరిపాలన, పంచాయతీల సేవలు ప్రతి పౌరునికి చెరువులోకి తెచ్చే నూతన పోకడలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న చట్టాలు, విధి విధానాలను విద్యార్థులు అవగాహన కల్పించుటకు తమ డెవలప్మెంట్ స్టడీ సెంటర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుతుందన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ పి మోహన్ రావు మాట్లాడుతూ, స్థానిక పాలనలో ప్రజల బాధ్యత, రాజ్యాంగ73,74 అధికరణలు, స్థానిక సంస్థల చట్టాల గురించి విద్యార్థులకు వివరించారు.కళాశాల చైర్మన్ కెవిఆర్ నరసింహారావు, మాట్లాడుతూ స్థానిక పరిపాలన అంశాలపై దేశంలో ఇటీవల పెను మార్పులు వచ్చాయన్నారు. తద్వారా స్థానిక సంస్థల బలోపేతం అవుతాయన్నారు.స్థానిక సంస్థలలో మహిళా రిజర్వేషన్, మహిళా సాధికారిత అంశాలు, విద్యార్థులకు పరిపాలన అంశాలపై అవగాహన కలుగుతుందన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, వివిధ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ద్వారా పోటీ పరీక్షలకు
ఉపయోగపడుతుందన్నారు.స్థానిక పాలన, ప్రజలకు చేరువ చేసే ప్రయత్నాలు, ప్రభుత్వాలు చేపడుతున్నాయని,అందులో భాగంగా ఈ పురసేవ, వాట్సప్ గవర్నర్స్ లాంటివి ఉదాహరణలుగా చెప్పవచ్చునన్నారు.

విద్యార్థులు స్థానిక సంస్థల పరిపాలపై అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ప్రధమ, ద్వితీయ బహుమతి గ్రహీతలకు సర్టిఫికెట్స్, మెమెంటోలతో సత్కరించినారు.

కళాశాల యాజమాన్యం, ముఖ్యఅతిథిగా విచ్చేసిన టంగుటూరి శ్రీరామ్, ప్రకాశం ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్ సభ్యులను సత్కరించినారు
ఈ కార్యక్రమానికి కళాశాల అడిషనల్ చైర్మన్ టి కృష్ణమూర్తి , కళాశాల సెక్రటరీ శ్రీ కె.వి సీతారామరాజు, కళాశాల ట్రెజరర్ ఆర్. ప్రవీణ్ భాను, అకాడమిక్ అడ్వైజర్స్ ఏబిఎస్ మూర్తి, నందుల సీతారామరావు, జూనియర్ కళాశాల చీఫ్ డోనర్ కంచర్ల వీర్రాజు, వినుకొండ రంగారావు, ప్రోగ్రాం కోఆర్డినేటర్స్ రాధా మాధవి, ఎన్ రవికుమార్ అధ్యాపకులు జానకిరామయ్య విజయలక్ష్మి తదితరులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.