Telugu News Power

జగన్ ప్రభుత్వం కాపు రిజర్వేషన్ రద్దు చేసినప్పుడు, వైసిపి కాపు నాయకులు ఏమయ్యారు? -విప్ బొలిశెట్టి ప్రశ్న.

కాపు రిజర్వేషన్ అమలు చేయాలని వినతి పత్రం అందజేస్తున్న నాయకులు.

అమరావతి: ఫిబ్రవరి,13(తెలుగు న్యూస్ పవర్) అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన కాపు రిజర్వేషన్ జగన్ ప్రభుత్వం రద్దు చేసినప్పుడు, ఈ కాపు నాయకులంతా ఏమయ్యారని, ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్ అమలు కోసం వినతి పత్రం అందజేయటానికి, భారతీయ కాపు సేన అధ్యక్షులు కాలువ వెంకటేశ్వరరావు అధ్యక్షతన పలువురు ప్రతినిధులు బొలిశెట్టిని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి విషయానికి, కాపు నాయకులు పవన్ కళ్యాణ్ ఆడిపోసుకోవడం పట్ల శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలుకెళ్లిన అంబటి రాంబాబు గతంలో కాపుల గురించి చేసిన వ్యాఖ్యలను బొలిశెట్టి తప్పు పట్టారు. అలాంటి వ్యక్తిని కాపు నాయకుడు రంగాతో పోల్చడం, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. కాపు రిజర్వేషన్ అమలు గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వారా తమప్రయత్నం చేస్తామన్నారు. భారతీయ కాపు సేన జాతీయ అధ్యక్షులు కాలవ వెంకటేశ్వరరావు (కన్నా) ఆధ్వర్యం జరిగిన ఈ కార్యక్రమంలో
శ్రీ వన్నెంరెడ్డి భవాని,
సుంకర గణేష్ కుమార్,
గాది శ్రీ సాయి శివ దుర్గ,
గుంటముక్కల వీరభద్రరావు,
నార్ని వాణి,
కనకం సత్య వాణి, జడ్డు శ్రీనివాస్ పాల్గొన్నారు.