Telugu News Power

జనసేనకు, లోకేష్ లక్ష విరాళం.

మచిలీపట్నం: మార్చి, 14(తెలుగు న్యూస్ పవర్. కామ్) జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, ఎన్నారై జనసైనికుడు లోకేష్, జనసేన పార్టీకి లక్ష రూపాయలు విరాళం ఇచ్చారు.ఈ మొత్తాన్ని, పెద్దిరెడ్డి వనజ, పార్టీ కార్యాలయంలో అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయాల పట్ల, అచంచలమైన విశ్వాసంతో ఈ విరాళం అందజేస్తున్నట్లు జర్మనీలో ఉంటున్న లోకేష్ తెలిపారు. పార్టీపట్ల అభిమానంతో భూరివిరాళం అందజేసిన లోకేష్ ను జనసైనికులు అభినందించారు.