Telugu News Power

జనసేన ఆవిర్భావ దినోత్సవం.

జనసేన ఆవిర్భావ సభకు హాజరైన నాయకులు
జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం

భీమవరం : మార్చి ,14 (తెలుగు న్యూస్ పవర్. కామ్ ప్రజలకు అండగా నిలుస్తూ వారి భవిష్యత్తు కోసం నిరంతరం పని చేస్తున్న పార్టీ జనసేన పార్టీ అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు భీమవరం ఆనంద పంక్షన్ హాల్లో శనివారం జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నిరంతరం కృషి చేస్తున్నారని, పేదల సంక్షేమ కోసం ఆవిర్భవించిన పార్టీ జనసేన పార్టీ అని అన్నారు. ప్రారంభంలో ఎదురుదెబ్బలు తగిలిన ఓటమిని జయించి 2024 ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ తో చారిత్రకమైన విజయాన్ని అందుకున్నామన్నారు. జనసేన పార్టీ ఆవిర్భవించి నేటికీ 13 ఏళ్ళు పూర్తి అయ్యాయని అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని, పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీ గల నాయకుడని ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో జనసేన పార్టీని స్థాపించారన్నారు. సినీ రంగంలో ఎంతో ఉన్న స్థితిలో ఉన్న పవన్ కళ్యాణ్ ఆదాయాన్ని వదులుకొని పేద ప్రజలకు సామాన్యులకు సేవలు అందించాలని ఉద్దేశంతో 2014 సంవత్సరంలో జనసేన పార్టీని స్థాపించారని, 2024 ఎన్నికల్లో బలమైన శక్తిగా ఎదిగి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి పవన్ కళ్యాణ్ చేసిన కృషి ఎంతో ఉందని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. జనసేన పార్టీని గ్రామస్థాయిలో బలపరిచి ముందుకు తీసుకెళ్లాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో జన సైనికులు కీలక పాత్ర పోషించాలని, పవన్ కళ్యాణ్ ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు, వీర మహిళలు ఒక పండుగగా జరుపుకుంటున్నారని అన్నారు. జనసేన పార్టీ కోసం కష్టపడిన ప్రతి సైనికునికి తప్పనిసరిగా గుర్తింపు లభిస్తుందన్నారు.
రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేశ్న కనకరాజు సూరి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, ఏపిఐఐసి డైరెక్టర్ చెనమల్ల చంద్రశేఖర్, జెడ్పిటిసి గుండా జయప్రకాష్, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ యరకరాజు హరిహరరాజు, ఎఎంసి వైస్ చైర్మన్ బండి రమేష్ మాట్లాడుతూ సామాన్యుడికి అండ జనసేన పార్టీ అని, రాష్ట్ర ప్రజల సమస్యల పరిస్కారం దిశగా జనసేన పార్టీని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థాపించారని అన్నారు, పార్టీ స్థాపించిన నాటి నుంచి ప్రజల పక్షాన అనేక పోరాటాలు చేశారన్నారు. అనంతరం కేక్ ను కట్ చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపిపి, సర్పంచ్లు, ఎంపిటిసిలు, పార్టీ పట్టణ కార్యదర్శులు, మండల అధ్యక్ష, కార్యదర్శులు, ఎఎంసి డైరెక్టర్లు, సొసైటీ బ్యాంకు చైర్మన్లు, డైరెక్టర్లు, ఆయా దేవాలయాల చైర్మన్లు, పాలకవర్గ సభ్యులు, ఉమ్మడి జిల్లాల మాజీ అధ్యక్షులు యిర్రింకి సూర్యారావు, వబిలిశెట్టి రామకృష్ణ, పత్తి హరివర్ధన్, మోకా శ్రీను, కత్తుల నీలేంద్ర, బాలాజీ, సుంకర రవి, జనసేన పార్టీ ముఖ్య నేతలు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.