నరసాపురం: మార్చి, 14(తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక జనసేన పార్టీ కార్యాలయం వద్ద పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ సభ ఘనంగా జరిగింది.
జనసేన పార్టీ స్థాపన నుండి ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కట్టుబడి పనిచేస్తోందని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రతి గ్రామం వరకు తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చాను.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్, మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సుబ్బరాయుడు, డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళి కృష్ణ, నరసాపురం నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు మరియు జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతం అయ్యింది. కొత్తపల్లి, చాగంటి,బొమ్మిడి ఓకే ఫ్రేమ్ లో కనిపించడంతో జనసేన శ్రేణులు హర్షాతిరేఖాలు వ్యక్తం చేశారు.
జనసేన పార్టీ నియోజకవర్గ కేంద్రం వద్ద ఘనంగా వేడుకలు.
ఆ నవ్వుల కోసమే నర్సాపురం జనసేన ఎదురుచూపులు