పాలకొల్లు: జనవరి,30(తెలుగు న్యూస్ పవర్) జాతిపిత, మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా శుక్రవారం, వైశ్య సంఘం వారు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక బంగారు వారి ఆర్యవైశ్య కళ్యాణమండపంలో, మహాత్మా గాంధీ, విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, రాపాక ప్రవీణ్ భాను పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా, అమర జీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి సనిశెట్టి లీలా భావనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి, పాత పోలీస్ స్టేషన్ వద్ద గల గాంధీ విగ్రహానికి, మన్యం జగ్గమ్మ సత్రం వద్దగల గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాటూరి నరసింహమూర్తి, బలభద్ర బాలరెడ్డియ్య, భోగవిల్లి నాగభూషణం, నాలం బాపిరాజు, బంగారు గుప్త, బుజ్జి, జవాజి రాజా,గమని శ్రీను, అన్నం జగదీష్ తదితరు వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.
జాతిపిత మహాత్మా గాంధీకి నివాళి
మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తున్న వైశ్య ప్రముఖులు