పాలకొల్లు: మార్చి, 14(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ (స్వయం ప్రతిపత్తి) కళాశాలలో ఈ నెల 24న తెలుగు విభాగం ఆధ్వర్యంలో తెలుగు “సాహిత్యం -మహిళా చైతన్యం” అనే అంశం పై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా తిరువీధులరాజరాజేశ్వరి తెలియజేశారు. కళాశాలలో ఈ సదస్సు గోడపత్రికను ఆవిష్కరించారు. తెలుగు శాఖాధ్యక్షులు డాక్టర్ బూసి వెంకటస్వామి సదస్సు సమన్వయకర్తగా,సహా సమన్వయకర్తగా జువాలజీ శాఖాధిపతి డాక్టర్ ఎం రామకృష్ణ,సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీగా కళాశాల వైస్ ప్రిన్సిపల్ మరియు రాజనీతి శాస్త్రం విభాగాధిపతి టి కృష్ణ వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ సదస్సు కు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగ పూర్వశాఖాధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరావు, మద్రాస్ విశ్వవిద్యాలయ తెలుగు శాఖధ్యక్షులు మరియు మద్రాస్ విశ్వవిద్యాలయ ప్రాచ్య భాష సంచాలకులు ఆచార్య విస్తాలి శంకర్రావు, రిసోర్స్ పర్సన్ గా హాజరవుతున్నారు. వీరితోపాటు వివిధ విశ్వవిద్యాలయ ఆచార్యులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, పరిశోధక విద్యార్థులు, స్నాతకోత్తర విద్యార్థులు హాజరవుతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు శాఖాధిపతి డా బూసి వెంకటస్వామి,ఐక్యూఏసి కోఆర్డినేటర్ కె భద్రాచలం, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ వి యామిని ,అర్థశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సిహెచ్ ఉషారాణి, ఆంగ్ల అధ్యాపకులు జీడి శ్రీనివాసరావు ,జె కె సి మెంటార్ శిరీష, సూపరెండెంట్ కనకమహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
జాతీయ తెలుగు సదస్సు గోడ పత్రిక ఆవిష్కరణ.
తెలుగు జాతీయ సదస్సు గోడపత్రిక ఆవిష్కరిస్తున్న దృశ్యం