Telugu News Power

జీవితాల్ని మార్చే శక్తి విద్య మాత్రమే. -మంత్రి నిమ్మల రామానాయుడు.

చల్లా రాజేంద్రప్రసాద్ సత్కరిస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు, కూటకు నాయకులు
విద్యార్థులతో కలిసి సైకిల్ తొక్కుతున్న మంత్రి నిమ్మల

పాలకొల్లు: ఏప్రిల్, 4 (తెలుగు న్యూస్ పవర్. కాం) ఒక పాల వ్యాపారి బిడ్డ కలెక్టర్ కావాలన్నా, కూతురు ఇంజనీర్ కావాలన్నా సాధ్యమయ్యేది విద్యతో మాత్రమేనని, దానికి శాసనసభ్యులు, మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక బిఆర్ పాఠశాలలో శనివారం జరిగిన ఉచిత సైకిల్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. పాలకొల్లు పరిసర పాఠశాలల తొమ్మిదో తరగతి విద్యార్థులకు 264 ఉచిత సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా, తన తల్లి విద్యార్థి దశలో విద్య కోసం కష్టపడిన రోజులు, ఉదయం గం.5 లకే
సైకిల్ పై చదువు కోసం వచ్చిన ఆ రోజులు మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర విభజన అని వార్యంగా జరిగిన పరిస్థితుల్లో 16 వేల కోట్ల రెవెన్యూ లోటు తో పరిపాల చేపట్టినప్పటికీ,ముఖ్యమంత్రి ద్రక్షతో ప్రజలకు అవసరమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించారన్నారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్సిపి పార్టీ రాష్ట్రాన్ని వ్యక్తం చేసింది అని ఆరోపించారు. ప్రజలకు మంచి చేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. కాంటినెంటల్ కాఫీ ఉత్పత్తుల కంపెనీ అధినేత చల్లా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, తమకు తల్లిదండ్రులు విద్యను మాత్రమే ఆస్తిగా ఇచ్చారన్నారు.
ఎవరి ఎదుగుదల కైనా విద్య అవసరం అన్నారు. రాజకీయ న్యాయ పదవుల్లో ఉంటుంది రాణించారన్నారు. అందుకు భిన్నంగా తాను పరిశ్రమ స్థాపించినట్లు తెలిపారు.
.ఇందువల్ల ఎందరికో ఉపాధి కల్పించగలుగుతున్నానని సంతృప్తి వ్యక్తం చేశారు. పచ్చని పశ్చిమగోదావరి అందాలు, ప్రజల ప్రేమ అభిమానాలు తనకు సంతోషం కలిగించాయన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కాంటినెంటల్ కాఫీ ఉత్పత్తుల గొప్పతనాన్ని సభలో వివరించారు. ఆ సంస్థ అధినేత చల్లా రాజేంద్ర ప్రసాద్ ను మంత్రి నిమ్మల, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు కూటమి నాయకులు ఘనంగా సత్కరించారు. కంపెనీ సి ఎస్ ఆర్ నిధులు నుంచి 25 లక్షల రూపాయలు ఉచిత సైకిళ్ల పంపిణీకి కేటాయించారు. మంత్రి నిమ్మల ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విశేషంగా పాల్గొని, కృతజ్ఞతా పూర్వక సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి, గుమ్మళ్ళ వీరస్వామి, మీద పాఠశాలల ఉపాధ్యాయులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోడి విజయభాస్కర్, తెలుగుదేశం నాయకులు, పెచ్చెట్టిబాబు, గండేటి వెంకటేశ్వరరావు, మీసాల రాము, వల్లభ శ్రీనివాస్, కర్నేని రోజా రమణి
గొట్టుముక్కలుసూర్యనారాయణ రాజు, పెనుమత్స రాంభద్రరాజు, పాములు రజని కుమార్, ఈతల శ్రీనివాస్, మామిడి శెట్టి పెద్దిరాజు, బిజెపి నాయకులు ఉన్నమట్ల కాపర్తి, జనసేన నాయకులు తులా రామలింగేశ్వర రావు, మండల రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.