Telugu News Power

జేఈఈ మెయిన్స్ లో మెరిసిన మరో ఆణిముత్యం హర్ష.

తమ్మినీడి హర్ష శ్రీ వినయ్

యలమంచిలి: ఫిబ్రవరి,21(తెలుగు న్యూస్ పవర్) మండల కేంద్రమైన యలమంచిలికి చెందిన తమ్మినీడి హర్ష శ్రీ వినయ్ జేఈఈ మెయిన్స్ లో ఆణిముత్యమై మెరిసాడు. హర్ష 99.97 పర్సంటెయిల్ తో మెయిన్స్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. జనవరిలో జరిగిన జే ఈ ఈ మెయిన్స్ పరీక్షకు సుమారు13 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. తమ్మినీడి(నందమూరి) శ్రీనివాసు, అరుణ దంపతులకు మొదటి సంతానం హర్ష. చదువులో తొలి నుంచి చురుగ్గా ఉంటూ, ప్రతిభావంతుడైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. అనేక పోటీల్లో బహుమతులు గెలుచుకున్నాడు. ఇతని విద్యాభ్యాసం పాలకొల్లు, విజయవాడ ప్రైవేటు విద్యాసంస్థల్లో కొనసాగింది. తొలి ప్రయత్నం లోనే అత్యుత్తమ ఫలితం సాధించడంతో యలమంచిలి గ్రామస్తులు హర్షకు అభినందనలు తెలియజేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని శుభాకాంక్షలు తెలియజేశారు.

తల్లిదండ్రులు, తమ్మునితో హర్ష