యలమంచిలి: ఏప్రిల్, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్)
యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి దండు పద్మావతి (57) పాలకొల్లు , డిఎన్ఆర్ పాఠశాల, ప్రధానోపాధ్యాయులు జేజేశ్వరరావుకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.33 వేల రూపాయలు సేకరించి అందించారు. వారు, వారి బంధువులు, శిష్యుల నుంచి సేకరించి, ఉపాధ్యాయులు, లక్ష్మీనారాయణకు ఈ మొత్తం అందజేశారు. మరో రూ.13 వేలు సోమవారం జమ చేయాలని నిర్ణయించారు. జేజేశ్వరరావు భార్య ఖాతాకు రూ.33 వేలు ఆదివారం జమ చేసారు. ఉపాధ్యాయుని, దండు పద్మావతి దొడ్డ మనసుకు ఉపాధ్యాయ లోకం జేజేలు పలుకుతున్నది
