
పాలకొల్లు, నవంబర్ 14, (తెలుగు న్యూస్ పవర్) కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ పాలకొల్లు వారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన, చెరుకూరి బుద్దావతారం రాజు స్మారక ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది.

ఈ సందర్భంగా క్లబ్ ఆవరణలో శుక్రవారం జరిగిన బహుమతి ప్రధానోత్సవ సభలో అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ భవిష్యత్తులో టెన్నిస్ తో పాటు షటిల్ లాంటి క్రీడలు కూడా జాతీయస్థాయిలో నిర్వహిస్తామని ప్రకటించారు. ఇప్పటికే షటిల్ బ్యాడ్మింటన్ కోచింగ్ జరుగుతుందన్నారు. ఇక్కడ కోచింగ్ తీసుకున్న క్రీడాకారులు చాలా చోట్ల, పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచారన్నారు. క్రీడలు ప్రేమిస్తే ,అది సమాజానికి ఎంతో ఎంతో మేలు చేస్తుందన్నారు. ఇలాంటి మహత్తర క్రీడా పోటీలు నిర్వహించటానికి క్లబ్ కు అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఎంతో వ్యయ ప్రయాసలతో కూడిన ఈ టోర్నమెంట్ విజయవంతం కావడానికి అహర్నిశలు శ్రమించిన తమ టీంకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. క్రీడల్లోనే కాకుండా, పార్టీలకు అతీతంగా అనేక సేవా కార్యక్రమాల్లో పాలకొల్లు కాస్మో కల్చర్ స్పోర్ట్స్ క్లబ్ ముందు ఉంటుందన్నరు. గోదావరి జిల్లాల అతిధి మర్యాదలు ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపింపజేయాలని తమ ఆశయం అన్నారు.

ఈ బహుమతి ప్రధానోత్సవ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ప్రభుత్వ మాజీవి విప్ నరసాపురం మాజీ శాసనసభ్యులు ముదునూరి ప్రసాద్ రాజు మాట్లాడుతూ، క్రీడల పట్ల బుద్ధ అవతారం రాజు చూపిన ఆదర్శంతో కాస్మోకోల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ ఈ పోటీలను ఎంత గొప్పగా నిర్వహించటం అభినందనీయం అన్నారు۔ క్రీడలు ప్రోత్సహించడం కోసమే ఈ క్లబ్ ఏర్పడిందన్నారు.ఈ క్లబ్ ఇలాంటి ఎన్నో జాతీయ స్థాయి క్రీడ పోటీలు నిర్వహించాలని ఆకాంక్షించారు. పాలకొల్లు ఏఎంసి చైర్మన్ కోడి విజయ భాస్కర్ మాట్లాడుతూ గోదావరి జిల్లాల మర్యాదలు ఎంతో గొప్పవన్నారు. మంచి మనసున్న, సేవాభావంగల గొప్ప వ్యక్తిఅని వారి ఆధ్వర్యంలో మరిన్ని క్రీడా పోటీలు భవిష్యత్తులో నిర్వహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొందరు క్రీడాకారులు మాట్లాడుతూ కాస్మో క్లబ్ తమను కొత్త అల్లుళ్ల మాదిరిగా ఎంతో ప్రేమ ఆప్యాయతలతో అందించిన ఆతిథ్య మర్చిపోలేమన్నారు. ఈ సభలో క్లబ్ కార్యదర్శి సోమరాజు, ఉపాధ్యక్షు అనంత, సూరిబాబు గోపాలకృష్ణంరాజు، డాక్టర్ వర్మ కోటి రామచంద్ర రాజు، రుద్రరాజు శ్రీనివాసరాజు، రుద్రరాజు సత్యనారాయణ రాజ(అజంత) సుబ్బరాజు, కార్యనిర్వహక సభ్యులు, డిఎస్ఎన్రాజు తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
విజేతలకు ట్రోఫీ, రివార్డులు అందజేశారు.

AISTA సర్క్యూట్ – మాస్టర్స్ కేటగిరీ ఫలితాలు విడుదల
విజయవాడ: AISTA సర్క్యూట్ మాస్టర్స్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ తాజా మ్యాచ్‌లు విజయవంతంగా ముగిశాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వయోవృద్ధ ఆటగాళ్లు 45+ నుండి 75+ వయో గణాల వరకు జరిగిన సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో అద్భుత ప్రతిభను ప్రదర్శించారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల ఆటగాళ్లు పతక స్థాయిని అధిరోహించారు.
🏆 75+ డబుల్స్
విజేతలు
రాధాకృష్ణ – చెన్నై
నాయుడు – అనకాపల్లె
రన్నర్లు
వై.వి. రామకృష్ణ – తెలంగాణ
ఎ.ఎస్.ఎన్. రాజు – నర్సాపురం
🏆 70+ డబుల్స్
విజేతలు
ఎస్. సెట్టు – తమిళనాడు
ఏ. రాంబాబు – తెలంగాణ
రన్నర్లు
రాధాకృష్ణమూర్తి – విజయవాడ
జి.వి. సన్యాసి రాజు – విజియానగరం
70+ సింగిల్స్
విజేత: ఎస్. సెట్టు (తమిళనాడు)
రన్నర్: జి.వి. సన్యాసి రాజు (విజియానగరం)
🏆 65+ డబుల్స్
విజేతలు
వి. శ్రీనివాస్ రెడ్డి – అనంతపురం
ఎస్.ఎస్. రాథ్ – ఒడిశా
55+ సింగిల్స్
విజేత: ఆర్. ఎన్ఆర్ రమేష్ (మైసూరు)
రన్నర్: సెంటిల్ కుమార్ (తమిళనాడు)
🏆 45+ సింగిల్స్
విజేత: రెడ్డి నాగరాజు (హిందూపురం)
రన్నర్: ఎం.ఎస్. కిరణ్ (మైసూరు)
🏆 45+ డబుల్స్
ఎం.వి.ఎల్.ఎన్. రాజు – విశాఖపట్నం
డింకర్ రెడ్డి – తిరుపతి
టి. రామారావు – విశాఖపట్నం
ఎం.వి.ఎల్.ఎన్. మధు – విశాఖపట్నం
45+ సింగిల్స్ ఫైనల్
రెడ్డి నాగరాజు
ఎం.ఎస్. కిరణ్‌పై విజయం
6–7 (7–4), 7–6 (10–8), (10–7) — ఉత్కంఠభరితమైన పోరు
55+ డబుల్స్ ఫైనల్
ఆర్. ఎన్ఆర్ రమేష్ / పాల్ మనోహర్
ముని కృష్ణ / జతిన్ మోహంతీపై
7–5, 7–5
45+ డబుల్స్ ఫైనల్
ఎం.వి.ఎల్.ఎన్. రాజు / డింకర్ రెడ్డి
vs
ఎం.వి.ఎల్.ఎన్. మధు / టి. రామారావు
(ఫలితం అధికారికంగా నమోదు కాలేదు)
దేశం నలుమూలల నుంచి క్రీడాకారులు ఒకచోట చేరి వారి అనుభూతులు, అనుభవాలు పంచుకొని ఆనందించే మధుర క్షణాలు,జ్ఞాపకాలు దాచుకునేందుకు అవకాశం కల్పించిన కస్మో కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ అవకాశం కల్పించడం పట్ల క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేశారు. క్రీడాకారులు వారి వయసు చెప్పే వరకు తెలుసుకోలేని ఫిట్నెస్ తో కొందరు ఉంటే, గాల్లో ఎగిరిపోయే సన్నని శరీరంతో టెన్నిస్ కోర్టులో సింహంలా తలపడ్డవారు మరి కొందరు. ఏటా జరిగే ఈ టెన్నిస్ పండగ కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ క్రీడా అధ్యాయంలో మరో గొప్ప క్రీడా స్ఫూర్తి,ప్రోత్సాహం తో నింపిన కొత్త పేజీని లిఖించింది.