అమరావతి: ఫిబ్రవరి,4(తెలుగు న్యూస్ పవర్)
భారత సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై విధించిన పన్ను 7శాతం ట్రంప్ ప్రభుత్వం తగ్గించడం, ఆక్వారంగానికి పూర్వ వైభవం తీసుకువస్తుందని వ్యవసాయ, మత్స్యశాఖామాత్యులు కింజరపు అచ్చం నాయుడు బుధవారం ఆశాభావం వ్యక్తం చేశారు. సచివాలయంలో ఇందుకు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు.గతంలో ఈ పన్ను 25 శాతంగా ఉండేది. ప్రస్తుతం ఆ పన్ను 18 శాతానికి కుదించారు. ఇందుకు అదనంగా అపరాధ రుసుము కూడా గతంలో వసూలు చేయడంతో సుమారు 58% టారిఫ్ పరిధిలో ఆక్వారంగం ఉండేది. గత ఏడాది, ఏప్రిల్-నవంబర్ మాసాల మధ్య అమెరికాకు 15% ఎగుమతులు పడిపోయాయి. దీని విలువ 2.01 లక్షల మెట్రిక్ టన్నులు. వీటి విలువ లో 6. 3% తగ్గిపోయింది. ఇందువల్ల 1.72 బిలియన్ అమెరికన్ డాలర్లకు ఎగుమతులు పడిపోయాయి. అమెరికా కేంద్రంగా ఎగుమతి అయ్యే ప్రోజన్ షింప్ రకం రొయ్యల ఎగుమతిపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. ట్రంప్ ప్రభుత్వం, టారిఫ్ 18 శాతానికి పరిమితం చేయడం వల్ల, అమెరికా మార్కెట్లో మన సముద్రోత్పత్తుల పోటీ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని అచ్చం నాయుడు అంచనా వేశారు. ఇంతవరకు బాండెడ్ గోదాముల్లో నిలువ ఉన్న ఉత్పత్తులు విడుదలకు అనుకూల పరిస్థితులు రానున్నాయని తెలిపారు. మన దేశం నుంచి సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 10-15 పెరగవచ్చు అన్నారు. ఇందువల్ల ప్రాసెసింగ్ యూనిట్లకు లాభాలు సమకూరతాయని తెలిపారు. గత టారిఫ్ వల్ల ప్రాసెసింగ్ యూనిట్లకు లాభాలు 5-5.5 శాతానికి తగ్గిపోయాయి. ఇప్పుడు వారికి లాభం 7-8 శాతం వరకు పెరగవచ్చు. ఇన్పుట్స్ పై కొత్త బడ్జెట్లో డ్యూటీ రాయితీలు ఆక్వారంగానికి అండగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర దేశాలకు కూడా దిగుమతులు స్థిరంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఎంపెడ అంచనాల ప్రకారం, 14-15 లక్షల మెట్రిక్ టన్నుల వరకు పెరగవచ్చు. మత్స్యరంగానికి సంబంధించి ప్రత్యక్షంగా, పరోక్షంగా సుస్థిరమైన అభివృద్ధి కి ఇది దోహదం చేస్తుందన్నారు.
ట్రంప్ టారిఫ్ తగ్గింపు, ఆక్వారంగానికి ఊపు.
టారిఫ్ తగ్గింపు పై మాట్లాడుతున్న మంత్రి అచ్చం నాయుడు