ఢిల్లీ: మార్చి, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్) భారత రాజధాని ఢిల్లీ 23వ లెఫ్టినెంట్ గవర్నర్‌గా తరణ్‌జిత్ సింగ్ గురువారం,ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక లోక్ నివాస్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.
Devendra Kumar Upadhyaya, Delhi High Court ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, ఆయన చేత పదవి మరియు గోప్యత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్త తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.ఈ పదవిలో వినయ్ కుమార్ సక్సేన ఉన్నారు.సక్సేనా ప్రస్తుతం లడాక్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు. వీరు
1988 బ్యాచ్‌కు చెందిన విదేశీ వ్యవహారాల శాఖ అధికారి అయిన సందు విదేశాంగ రంగంలో విశేష అనుభవం కలిగి ఉన్నారు. ముఖ్యంగా అమెరికా వ్యవహారాలపై ఆయనకు మంచి పరిజ్ఞానం ఉంది.
అతను 2020 నుండి 2024 వరకు అమెరికాలో భారత రాయబారిగా పనిచేశారు. అంతకు ముందు వాషింగ్టన్, డిసి లోని భారత దౌత్య కార్యాలయం మరియు యు.ఎన్.ఓ వద్ద కూడా సేవలందించారు.
ఈ నియామకం ఢిల్లీ పరిపాలనలో ఒక ముఖ్యమైన పరిణామంగా భావిస్తున్నారు.
ఢిల్లీకి కొత్త లెఫ్టినెంట్ గవర్నర్‌గా తరణ్‌జిత్ సింగ్ సందు ప్రమాణ స్వీకారం
ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ గా సింగ్ ప్రమాణ స్వీకారం