యలమంచిలి: మార్చి, 10(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక మేడపాడు ప్రభుత్వ ఆసుపత్రి ప్రక్కనగల సి ఎం ఎస్ బాలల గృహం నుంచి ఇళ్ల కరుణ అనే బాలిక తప్పిపోయింది. ఈమె వయసు 13 ఏళ్లు. ఈ నెల 7వ తేదీ నుంచి ఈ బాలిక కనిపించడం లేదు. ఈ మేరకు ఆమె తల్లి పెద్దింట్లు మండల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, గురవయ్య( 9440796672)
మంగళ వారం పత్రికలకు ఈ వివరాలు వెల్లడించారు. బాలిక ఆచూకీ తెలిసినవారు, పాలకొల్లు, ఎస్.ఐ , రూరల్, 9440796667, యలమంచిలి పోలీస్ స్టేషన్,9154875675 ఫోన్ నెంబర్లకు తెలియజేయవలసిందిగా కోరారు.
తప్పిపోయిన బాలిక.
తప్పిపోయిన ఇళ్ల కరుణ