Telugu News Power

తిరుమల పవిత్రతను కాపాడాలి. చైర్మన్ నాయుడును బర్తరఫ్ చేయాలి. -తి.తి.దేవస్థానం మాజీ ధర్మకర్త శేషుబాబు డిమాండ్.

టీటీడీ చైర్మన్ నాయుడు బర్తఫ్ కోసం డిమాండ్ చేస్తున్న మాజీ ధర్మకర్త మేక శేషుబాబు

పాలకొల్లు: ఏప్రిల్, 4(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన, కలియుగ ప్రత్యక్ష దైవం, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పవిత్ర ఆలయ చైర్మన్ బి ఆర్ నాయుడు వెంటనే బర్తరఫ్ చేయాలని టీటీడీ ట్రస్ట్ బోర్డ్ మాజీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మేకా శేషుబాబు డిమాండ్ చేశారు. స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ వద్ద గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ శ్రేణులతో కలసి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ నుంచి బహిష్కృతులై, పునరాగమనం సందర్భంగా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. పవిత్ర దేవాలయానికి అధ్యక్షులుగా ఉండి, అనైతిక కార్యక్రమాలకు పాల్పడడాన్ని, శేషుబాబు గర్హించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు ఇతని చర్యల వల్ల దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైసిపి ప్రభుత్వం ఉన్నప్పుడు, సినిమా నటులు, పృద్వి ని, అప్పటి చైర్మన్ ఎస్ వి సుబ్బారెడ్డి వెంటనే ఎస్ వి బి సి చైర్మన్ పదవి నుంచి తొలగించినట్టు గుర్తు చేశారు. ప్రభుత్వం వెంటనే బి ఆర్ నాయుడును చైర్మన్ పదవి నుంచి తొలగించకపోతే వైసీపీ పార్టీ ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తుందని హెచ్చరించారు. క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయ ధర్మకర్తల మండలి మాజీ అధ్యక్షులు కోరాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, జడ్పిటిసి నడపన గోవిందరాజులు నాయుడు, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు చెల్లెం ఆనంద ప్రకాష్, డీసీఎంఎస్ మాజీ అధ్యక్షులు యడ్ల తాతాజీ, యలమంచిలి వైసిపి అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్ బాబు, రాష్ట్ర మహిళా నాయకురాలు,కర్ర జయ సరిత, లోపింటి చిరంజీవి, మాజీ కౌన్సిలర్ మద్దా చంద్రకళ, జోగాడ ఉమామహేశ్వరరావు, పెచ్చెట్టి కోటేశ్వర రావు, గవర బుజ్జి, బండి రమేష్, మోర్త గిరీష్, మామిడి శెట్టి చిట్టి బాబు, విల్సన్ బాబు, జూకి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.