Telugu News Power

త్వరలో టిడ్కో ఇళ్ళ గృహప్రవేశాలు – మంత్రి నిమ్మల

టిడ్కో ఇళ్ళను పరిశీలిస్తున్న మంత్రి నిమ్మల

పాలకొల్లు: నవంబర్,22 (తెలుగు న్యూస్ పవర్) పేదలు, మహిళలు ఎప్పుడా,ఎప్పుడా అని ఎదురుచూస్తున్న టిడ్కో ఇళ్ల గృహప్రవేశం కోసం ఇక తన దృష్టి కేంద్రీకరించి పనిచేస్తానని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖామాత్యుల నిమ్మల రామానాయుడు ప్రకటించారు. పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై అధికారులతో శనివారం మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. కోట్లాది రూపాయలు నిధులతో పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రగతినీ మంత్రి స్వయంగా ద్విచక్ర వాహనంపై، కూటమి నాయకులతో కలిసి తిరుగుతూ పరిశీలించారు. ఇప్పటికే కొద్దిపాటి పనులతో నిలిచిపోయిన టిడ్కో గృహాలను పూర్తిచేసి లబ్ధిదారులకు త్వరలో అందజేస్తామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడుప్రతి టిడ్కో ఇంటికి ఆరు లక్షల నిధులతో లబ్ధిదారులకు అందజేసిందన్నారు. తర్వాత వచ్చిన వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వాటిని ఆరు లక్షలకు తాకట్టు పెట్టి లబ్ధిదారులను అప్పుల్లో ముంచిందన్నారు. టిడ్కో ఇళ్ల కాలనీలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడానికి పనులు జరుగుతున్నాయన్నారు. పాలకొల్లుకు అత్యంత ఆధునిక వసతులతో కూడిన కార్పొరేట్ స్థాయి ఆసుపత్రి నిర్మాణానికి 12.60 కోట్ల నిధులు మంజూరు చేయించానన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పనులు పడకేయిచిందన్నారు. చేసిన కొద్దిపాటి పనులు కనీస నాణ్యత లేకుండా చేయడం వల్ల ఆ పనులు కూడా దెబ్బతిన్నాయని ఆరోపించారు. ఇప్పుడు కూటమిప్రభుత్వం వచ్చాక، ఆసుపత్రి పనులు చురుగ్గా సాగిస్తున్నామన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనం، గౌడ శెట్టిబలి భవనం,ముస్లిం షాది ఖానా, క్రైస్తవుల సమాదుల ప్రాంతంలో జరుగుతున్న పనులు, అబ్దుల్ కలాం పార్క్ పనులు, రామగుండం పార్క్ పనులు ఊపందుకున్నాయన్నారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ విజయ సారధి. కూటమి నాయకులు పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వర రావు،ఉన్నమట్ల కపర్ది, బోనం నరసయ్య ,ధనాని సూర్య ప్రకాష్, అల్లం తాతాజీ ,మహమ్మద్ జానీ, ధనాని సూర్య ప్రకాష్, వళ్లభు శ్రీనివాస్، మండేలా రాంప్రసాద్، కిలారి రామారావు ،ముప్పిరి సత్యనారాయణ ,కొల్లు ఉదయ పవన్ ,మండాది అవినాష్، బందేల భాస్కరరావు, మామిడి శెట్టి పెద్దిరాజు, ముత్తాబత్తుల దొరబాబు, మల్లంపల్లి పకీర్ బాబు, అంగర్ చిన్న తదితర నాయకులు పాల్గొన్నారు.