Telugu News Power

దాణా ధర పెంపు పై రొయ్యల రైతుల తీవ్ర ఆందోళన.

సమావేశంలో మాట్లాడుతున్న రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు

పాలకొల్లు: జనవరి, 31(తెలుగు న్యూస్ పవర్) రొయ్యల దాణా ధర పెంపు ఆలోచన ఫై రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని, జై భారత్ క్షీరా రామ రైతు సంఘం అధ్యక్షులు, గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు వెల్లడించారు. రొయ్యల ఫీడ్ ధరలు పెరగవచ్చుననే సమాచారం బయటకు పొక్కడంతో, రైతులు అత్యవసర కార్యవర్గ సమావేశం పూలపల్లిలో,శనివారం ఏర్పాటు చేశారు. గతంలో, దాణాకు వాడే ముడి సరుకుల ధరలు బాగా తగ్గినందున, ఆమేరకు ఫీడ్ ధర కనీసం 20 రూపాయలు, తగ్గించాలని గతంలో కోరగా, కంటి తుడుపు, చర్యగా కేవలం 4రూపాయలు మాత్రమే తగ్గించారని తెలిపారు. దాణా తయారీదారులు, ముడి సరుకులు ధరలు పెరక్కపోయినా, అకారణంగా, అకాల ధరల పెంపు పై ఆక్వా రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఫీడ్ ప్లాంట్ యాజమాన్యాలు, ఫీడ్ ధర తగ్గించాలన్న ప్రభుత్వ ఆదేశాలను కూడా పాటించలేదన్నారు. మళ్లీ ఇప్పుడు, ధరలు పెంచడానికి, సిద్ధం కావడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. గత నాలుగైదు నెలలుగా, సీడ్ బాగోక, కనీసం 40 రోజులు కూడా నిలబడక,రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మునిగే నక్కపై, తాటికాయ పడ్డట్టు, నష్టాల్లో ఉన్న రైతులపై, ఈ ధరల పెంపు తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. సంబంధిత మంత్రులు, అధికారులు దీనిపై వెంటనే స్పందించాలని కోరారు. ఫ్యాక్టరీ యజమానులకు, రొయ్యల సాగు మూడు వంతులు పడిపోయిన సంగతి తెలుసన్నారు. పాలకొల్లు, నర్సాపురం, ఆచంట నియోజకవర్గాల్లో గల సుమారు 5 వేల మంది రొయ్యల రైతులు తదుపరి కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. ఫ్యాక్టరీ యాజమాన్యాలు ధరల పెంపు విషయంలో రైతు సంఘాలతో సంప్రదించిన మీదట మాత్రమే ఫీడ్ ధర పెంచాలని అప్సడ ఏర్పాటు చేశారా, వారితో సంప్రదించి నిర్ణయం తీసుకున్నారా అని ప్రశ్నించారు. రైతుల పట్ల మానవత్వం తో ఆలోచించి నిర్ణయాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం భోనం చిన్న బాబు, తదితరులు రైతులు పాల్గొన్నారు.