Skip to main content

Telugu News Power

పింఛను పదనిసలు

చొక్కా ఇస్త్రీ చేస్తున్న మంత్రి నిమ్మల

పాలకొల్లు: జనవరి,31(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు, నిమ్మల రామానాయుడు, ఎన్టీఆర్ భరోసా పింఛను లు శనివారం స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా, పూలపల్లి లో రజకుడు వెంకటేశ్వరరావును పరామర్శించారు. అతని కాలు గత కొన్ని నెలలుగా, చీము పట్టి దెబ్బతిన్నట్టు తెలుసుకొని, మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఫోన్ లో వైద్యులు ఉండి అప్పారావును సంప్రదించి, వారికి మెరుగైన వైద్యం అందించవలసిందిగా కోరారు. అతని మందుల ఖర్చులు భరిస్తానని మంత్రి తెలిపారు. మంత్రి పింఛన్ తో పాటు, ఓ చొక్కా పాటి ఇస్త్రీ కూడా చేసి ఇచ్చారు. ఆ దంపతులు, ఇందుకు ఎంతో సంతోషించారు. రాజకీయ నాయకులు సాధారణంగా ఎన్నికల్లో ఇలాంటి పనులు చేస్తుంటారు. ప్రస్తుతం ఏ ఎన్నికలు లేకపోయినా, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని గమనించి సహాయం చేయడం ద్వారా మంత్రి గొప్ప మనసు చాటుకున్నారు.