పాలకొల్లు: జనవరి,29(తెలుగు న్యూస్ పవర్) ప్రస్తుత దాల్వా వరిపై మొవ్వు పురుగు ఆశించినట్టు ఏడిఏ మురళీకృష్ణ రైతులకు వెల్లడించారు. రైతు బడి కార్యక్రమంలో భాగంగా లంకలకోడేరులో రైతు క్షేత్ర పాఠశాల నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన క్షేత్ర పర్యటనలో వరిపై మొవ్వు కుళ్ళు తెగులు ఆశించినట్టు గుర్తించారు. ఈ తెగులు నివారణకు, ఐసోసైక్లోసరాన్ అనే పురుగుమందు, ఒక మిల్లిలీటర్, ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలని రైతులకు సూచించారు. జింక్ లోపం నివారణకు, రెండు గ్రాముల,జింక్ సల్ఫేట్, ఒక లీటర్ నీటిలో కలిపి, ఒక ఎకరానికి 150 లీటర్లు చొప్పున వారిపై చల్లాలని తెలియజేశారు. ఈ విధంగా ఐదు రోజుల తర్వాత మరోసారి పిచికారీ చేయాలన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితి చలిగా ఉండటం వల్ల ఈ లోపాలు కనిపిస్తున్నాయన్నారు. అతిగా పురుగు మందులు వాడటం వల్ల పేరుకు మేలు చేసే మిత్ర పురుగులు చనిపోతాయన్నారు. రైతులు వ్యవసాయ అధికారుల సూచన మేరకు మాత్రమే పురుగు మందు చల్లాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత దశలో వరిచేలకు కాంప్లెక్స్ ఎరువులు వేయడం వల్ల ప్రయోజనం లేదని రైతులు గమనించాలన్నారు. వరి పంట నమోదు గురించి ఈ కార్యక్రమంలో వివరించారు. ఏపీ ఎఫ్ ఆర్ నమోదు గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
దాల్వా వరి పైరు పై, మొవ్వు పురుగు.
పొలంబడి, వ్యవసాయ క్షేత్రం పర్యటన