హైదరాబాద్: మార్చి, 14(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు,విద్యాశాఖ మంత్రి, నారా లోకేష్, బ్రాహ్మణి ముద్దుల తనయుడు దేవాన్ష్ ధోతీ వేడుక అత్యంత సన్నిహితుల మధ్య శనివారం జరిగింది. ధోతి (నూతన వస్త్ర బహుకరణ) వేడుక సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో నిర్వహించారు. నారా–నందమూరి కుటుంబాల్లో ఆనంద వాతావరణం నెలకొంది.
కుటుంబ సభ్యుల సందడి
ఈ వేడుకకు తాత నందమూరి బాలకృష్ణ, నానమ్మ భువనేశ్వరి ఆయన కుటుంబ సభ్యులు హాజరయ్యారు. పెద్దలు దేవాన్ష్‌కు కొత్త ధోతి వస్త్రాలు బహుకరించి ఆశీర్వదించారు. 13వ ఏట అడుగు పెట్టనున్న దేవాన్ష్
ఈ నెల 21న దేవాన్ష్ 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ ఏట అడుగుపెట్టనున్న నేపథ్యంలో ఈ ధోతి వేడుకను నిర్వహించినట్లు సమాచారం.
సంప్రదాయ దుస్తుల్లో దేవాన్ష్ కనిపించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
దేవాన్ష్ పంచకట్ల సందడి.
పంచకట్ల కార్యక్రమం సందర్భంగా కుటుంబ సభ్యుల తో దేవాన్ష్.