
దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పాలకొల్లు, పెనుమదం రోడ్డులోగల అంజలి మానసిక దివ్యాంగుల పాఠశాలను సోమవారం తమ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. పాఠశాల విద్యార్థులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ వారితో ముచ్చటించారు. నిమ్మల రామానాయుడు, సూర్యకుమారి దంపతులు వారి కుమార్తె శ్రీజపవన్ దంపతులు పాల్గొని విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆ చిచ్చర పిడుగుల ముఖాల్లో వెల్లివిరిసిన ఆనందాల హరివిల్లు చూసి చిచ్చుబుడ్లు చిన్నబుచ్చుకొన్నాయి, మతాబులు ముఖం ముడుచుకున్నాయి. కుటుంబ సభ్యులంతా ప్రేమా, వాత్సల్యా లతో మిఠాయిలు నోటికి అందించితినిపించారు. గోమాతకు ఆహారం అందించారు. ఏటా జరిగే ఈ కార్యక్రమం ఈ ఏడాది అంజలి మానసిక దివ్యాంగుల పాఠశాల లో జరుపుకొన్నారు. ఇప్పుడు తన కుమార్తె తో పాటు అల్లుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడంపట్ల సంతోషం వ్యకంచేశారు. పెద్ద మనసు చేసుకొని దివ్యాంగుల పాఠశాలకు దీపావళి పండుగలా వచ్చిన నిమ్మలను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పెశ్చెట్టి బాబు తదితరులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు
https://www.youtube.com/shorts/RxIp3wMyHXk
