పాలకొల్లు: ఫిబ్రవరి,12 (తెలుగు న్యూస్ పవర్) జాతీయ సార్వత్రిక సమ్మె సందర్భంగా, గురువారం, అఖిల భారత కేంద్ర కార్మిక, ఉద్యోగ సంఘాల రాష్ట్ర యూనిట్ల తరఫున, స్థానిక ఏ పి ఎన్ జి ఓ యూనిట్ సంఘీభావం తెలిపింది. రాష్ట్ర, జిల్లా సంఘాల పిలుపుమేరకు, భోజన విరామ సమయంలో, స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ వద్ద ఎన్జీవో నాయకులు, సభ్యులు, వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు.
ఏపీఎన్జీజీవో పాలకొల్లు, యూనిట్ అధ్యక్షులు గుడాల హరిబాబు, కార్యదర్శి గుబ్బల ప్రసాదు,కోశాధికారి కిరణ్మయి. సతీష్ రెడ్డి. ముచ్చర్ల శ్రీనివాసు. రాజేష్ బాబు. బాలచంద్రుడు. అమలేశ్వర రావు. దివాకర్ బాబు. నాగరాజు.యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి క్రాంతి కుమార్. పెన్షనర్స్ సంఘ నాయకులు ప్రతాపరాజు. అజయ్ కుమార్. కంచి సత్యనారాయణ. మహిళా కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.