నరసాపురం: ఏప్రిల్, 10(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక డివిజన్, డీఎస్పీగా మేకా సుధాకర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించిన సుధాకర్‌కు విస్తృత అనుభవం ఉంది.
నరసాపురం పరిధిలో చట్టం, శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తానని ఆయన తెలిపారు. ప్రజలతో స్నేహపూర్వక పోలీసింగ్ తో, నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు.
నరసాపురం డీఎస్పీగా మేకా సుధాకర్ నియామకం.
నూతన డిఎస్పి సుధాకర్