Telugu News Power

నిజాయితీకి సూపర్ స్టార్ రజినీకాంత్ సత్కారం.

పద్మకు బంగారం గొలుసు బహూకరిస్తున్న సూపర్ స్టార్ రజినీకాంత్
దొరికిన ఆభరణాలు

చెన్నై: ఫిబ్రవరి,5(తెలుగు న్యూస్ పవర్)సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల పారిశుద్ధ్య కార్మికురాలు పద్మను సత్కరించారు. చెన్నై టీ నగర్ లో రోడ్డు పక్కన
పట్టించుకోకుండా పడి ఉన్న 45 సవర్ల బంగారు ఆభరణాలు, విధి నిర్వహణలో ఉండగా పద్మ కంట పడ్డాయి. వెంటనే వాటిని పై అధికారులకు ఆమె అందజేసాశారు. పాండి బజార్ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు. సుమారు 45 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని పోలీసులు సొంతదారులకు అప్పగించారు. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్ కే స్టాలిన్, ఈ విషయం తెలుసుకుని, పద్మకు లక్ష రూపాయల చెక్కును ప్రభుత్వం తరఫున అందజేశారు. పోస్టల్ శాఖ తపాలా బిళ్ళను విడుదల చేసింది. ఈ అసాధారణ, నిజాయితీకి ప్రజల నుంచి, సోషల్ మీడియా వేదికల నుంచి పద్మకు విశేషమైన అభినందనలు అందుకున్నారు. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పద్మ కుటుంబాన్ని తన ఇంటికి పిలిపించుకొని సత్కరించారు. ఈ సందర్భంగా ఆమెకు బంగారు గొలుసు బహుకరించారు. నెలనెలా పదివేల రూపాయలు అందజేస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. తమిళనాడు రాష్ట్రం తో పాటు దేశమంతా ఇప్పుడు ఈ సంఘటన గురించి వార్త వైరల్ గా మారి విస్తృతంగా ప్రచారం అవుతుంది. ఇది నిజాయితీ విజయం.