Telugu News Power

నిత్య అన్నదాన పథకానికి రామడుగుల లక్ష విరాళం.

ముత్యాల పథకానికి విరాళం అందజేస్తున్న రామడుగుల కుటుంబ సభ్యులు

భీమవరం: ఏప్రిల్, 6(తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న, ప్రముఖ ఇలవేలుపు ఆరాధ్య దైవం, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి నిత్య అన్నదాన ప్రసాద వితరణకి భీమవరం కి చెందిన రాచమడుగుల వెంకటేశ్వరరావు శ్యామల దంపతులు లక్ష నూటపదహారు రూపాయలు విరాళం సమర్పించారు. ఆలయ అర్చకులు వీరికి ఆశీర్వచన పూజలు చేశారు.ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ప్రసాదం, అమ్మవారి చిత్రపటం అందజేసారు. ధర్మకర్తల మండలి సభ్యులు యు.మీనాక్షి పాల్గొన్నారు..