పాలకొల్లు: ఏప్రిల్, 6(తెలుగు న్యూస్ పవర్. కామ్) నీటి భద్రత పై వందరోజుల కార్యాచరణకు సంబంధించి సోమవారం స్థానిక లాకుల వద్ద ఉన్న నీటి పారుదల శాఖ కార్యాలయంలో డిస్ట్రిబ్యూటరీ కమిటీచైర్మన్ పెనుమత్స రామభద్ర రాజు సమావేశం నిర్వహించారు. రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు, కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశాల మేరకు నీటి భద్రతపై వందరోజుల కార్యాచరణ చేపడుతున్నట్టు వెల్లడించారు. నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభమైంది. వచ్చే జూలై నెల 14 వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో, నీటి సంరక్షణ, భూగర్భ జలాల టేబుల్ పెంపకం, సమీకృత నీటి నిర్వహణ లక్ష్యాలుగా నిర్దేశించారు. పూడిపోయిన చెరువులు కాలువల పూర్వ స్థానానికి తీసుకురావడం, చెరువుల అనుసంధానం, రక్షణ నిర్మాణాలు చేపట్టటం పై సమావేశంలో చర్చించారు. సంబంధిత శాఖల అధికారులు, అధ్యక్షులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఎఇఇ శ్రీనివాస రావు, నీటి సంఘాల అధ్యక్షులు, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, మాతా రత్నం రాజు, దానికి వెంకట కృష్ణారావు, ఆరమిల్లి చిన్ని, పులఖండం వీర రాఘవులు, దేవళ్ళ రామకోటి, దేవరపు దొరబాబు, ఇంటి శ్రీరాముడు, కుక్కల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
నీటి భద్రతపై 100 రోజుల కార్యాచరణ.
నీటి భద్రతపై 100 రోజులు కార్యాచరణ కార్యక్రమంలో పాల్గొన్న నీటి సంఘాల అధ్యక్షులు