పాలకొల్లు: డిసెంబర్, 31 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో సందేశంలో, ఈ ఏడాది కూడా కొత్త సంవత్సర వేడుకల ఆడంబరాలకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు. అందుకు ప్రతిగా, అంబేద్కర్ విగ్రహాల పై నిర్మాణాలు పూర్తి చేయడానికి, ధన రూపంలో గాని, శ్రమదాన రూపంలోగాని ఇవ్వాలని, తన ఆలోచనగా తెలిపారు. గ్రామంలో నిరుపేద ఇంటి నిర్మాణానికి సహాయం చేయాలని కోరారు.