పాలకొల్లు: మార్చి, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్) నేటి నుంచి ప్రారంభం కానున్న జాతీయస్థాయి నాటికోత్సవాలకు కళాభిమానులందరూ హాజరు కావలసిందిగా అధ్యక్షులు కెవి కృష్ణ వర్మ విజ్ఞప్తి చేశారు.
దేశవ్యాప్తంగా ప్రసిద్ధ నాటక బృందాలు పాల్గొనే
అద్భుతమైన రంగస్థల నాటిక ప్రదర్శనలు జరుగుతాయని గురువారం తెలిపారు. సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను రూపుమాపి, ప్రజలను చైతన్యం చేయటానికి ఈ నాటికలు తోడ్పడతాయన్నారు. ఈ నాటక పరిషత్ నిర్వహణకు సహకరిస్తున్న కాష్మో క్లబ్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, టౌన్ హాల్, అల్లు అర్జున్, బన్నీ వాసు, తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. నేటి నుంచి మూడు రోజులపాటు,బస్ స్టాండ్ సమీపంలోని ఆడబాల థియేటర్ వెనుక ఉన్న ప్రాంగణంలో ఈ పరిషత్తు నిర్వహిస్తున్నామన్నారు.
ప్రతిభావంతులైన నటీనటుల ప్రదర్శనలు,విశిష్ట అతిథుల సమక్షంలో కార్యక్రమాలు జరుగుతాయన్నారు.
రంగస్థల కళాకారులను సన్మానిస్తారు.కళాభిమానులకు ఈ నాటక ఉత్సవాల్లో ప్రదర్శనలు, కనుల విందుగా, సంభాషణలు చెవులను చక్కిలిగింతలు పెట్టి వీనుల విందు చేయనున్నాయి. ఈ కార్యక్రమంలో మేడికొండ శ్రీనివాస్, మానాపురం సత్యనారాయణ, జక్కంపూడి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచే పాలకొల్లు కళాపరిషత్ ఆధ్వర్యంలో 17వ జాతీయ స్థాయి నాటిక పోటీలు.
నాటక పరిషత్ సూత్రధారులు