పాలకొల్లు: ఏప్రిల్, 10(తెలుగు న్యూస్ పవర్ .కాం) స్థానిక హౌసింగ్ బోర్డ్ లో స్థాపించిన అల్లూరి సీతారామరాజు జాతీయ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, సినిమాటోగ్రఫీ మంత్రి శనివారం ప్రారంభిస్తారని అధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు, దర్శకులు, వివి వినాయక్, వి ఎన్ ఆదిత్య, రేలంగి నరసింహారావు, తమ్మారెడ్డి భరద్వాజ, ప్రముఖ నటులు శ్రీకాంత్, రచయిత పైడిపాటి రాజేంద్రకుమార్, నిర్మాత తుమ్మలపల్లి రమా సత్యనారాయణ ఈ కార్యక్రమానికి హాజరవుతారని వివరించారు. స్థానిక కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం, అధ్యక్షులు, గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, గౌరవ సలహాదారు మాజీ మంత్రి, ఎంపీ నిర్మాత శివుడి హరి రామ జోగయ్య తదితర ప్రముఖులు ఉంటారని శ్రీనివాస్ తెలిపారు.