పాలకొల్లు: ఫిబ్రవరి,11(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఛాంబర్స్ కళాశాలలో ఫిబ్రవర,12న మధ్యాహ్నం 2 గంటల నుంచి “స్థానిక పాలనపై ఆధునిక పోకడలు” అన్న అంశంపై సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రకాశం ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్, హైదరాబాదు వారి ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్టు చైర్మన్, కారుమూరి నరసింహారావు తెలిపారు. ఈ సదస్సులో టంగుటూరి శ్రీరామ్, ప్రొఫెసర్ పి. మోహన్ రావు, సిహెచ్ విద్యాసాగర్, ఎన్ దేశాయ్, మున్సిపల్ కమిషనర్ బి. విజయ సారధి, తహసిల్దార్ వై దుర్గ కిషోర్, కళాశాల యాజమాన్యం, పాల్గొంటారు. ఈ సదస్సుకు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, ఇచ్చావత్తులు హాజరు కావలసిందిగా కోరారు.
ఈ సదస్సుకు సంబంధించిన అంశాలపై విద్యార్థులకు వ్యాసరచన వకృత్వ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తారని తెలిపారు.
నేడే ఛాంబర్స్ కళాశాలలో ఆధునిక పాలనపై సదస్సు.