భారత స్వాతంత్ర్య సంగ్రామ విప్లవాగ్ని రగిలించిన తొట్టతొలి యోధుడు, భరతజాతి ముద్దు బిడ్డ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. తలతెగిపడినా, మొండెం ఆధారంగా యుద్ధం చేసిన మహావీరుడు, సమరసింహం ఈ నరసింహారెడ్డి. త్యాగాల ఉయ్యాల స్పూర్తి,భారత స్వాతంత్ర్య ఉద్యమంలో సువర్ణాక్షరాలతో లిఖించిన ఓ మహాధ్యాయం. వీరి జీవితచరిత్ర మూలంతో, సైరా నరసింహా రెడ్డి పాత్ర చిరంజీవి నటించి చలన చిత్రం పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించారు. ఈ విప్లవవీరుల విగ్రహాన్ని పెనుమంట్ర మండలం, మార్టేరు కూడలి వద్ద నేడు ఆదివారం ఉదయం ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామాత్యులు బీసీ జనార్దన రెడ్డి స్వర్ణాస్తాలతో ఈ మహత్తర కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు, ప్రివిలేజ్ కమిటీ అధ్యక్షులు ప్రివిలేజ్ కమిటీ అధ్యక్షులు, పితాని సత్యనారాయణ, మార్టేరు ముద్దుబిడ్డ మాజీ ఎమ్మెల్యే చర్ల జగ్గారెడ్డి, రాష్ట్ర రవాణా శాఖమాత్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, విగ్రహ దాత, రాష్ట్ర మధ్య తరహా చిన్న తరహా పత్రికల సంఘం అధ్యక్షులు, కర్రి వీర వెంకట సత్యనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎస్సార్ గోపీనాథ్ రెడ్డి, కాయల వెంకటరెడ్డి, ద్వారంపూడి వేణుగోపాల కృష్ణారెడ్డి, పంచ గ్రామ రెడ్డి సేవ సంఘ అధ్యక్షులు కె కె ఆర్ చంద్రశేఖర రెడ్డి (ఆచారి) తదితరలు పాల్గొoటారు.
నేడే స్వాతంత్య్ర యోధుడు ఉయ్యాలవాడ విగ్రహఆవిష్కరణ