పాలకొల్లు: డిసెంబర్,27(తెలుగు న్యూస్ పవర) స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్రజలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు, శనివారం మత్స్యకారులకు చెక్కులు పంపిణీ చేశారు. వరదల విపత్తు కారణంగా, కాజ్వే మునిగిపోవడం, ప్రజల దైనందిన జీవన ప్రయాణానికి ఇబ్బంది పడటం జరిగేది. కూటమి ప్రభుత్వం వచ్చాక, ఈ సమస్య లేకుండా, కూటమి ప్రభుత్వం వారు ప్రజలకు పడవలు ఏర్పాటు చేశారు. ఈ పడవల సొంతదారులకు రెండు విడతలుగా సొమ్ములు చుక్కల రూపంలో చెల్లించారు. మొదటి విడత 3.90 లక్షలు, రెండవ విడత 1.87 లక్షలు విలువైన చెక్కులు అందజేశారు. ఈ మొత్తం 5.77 లక్షలు, కనకాయలంక అగ్నికుల క్షత్రియులకు మంత్రి చేతుల మీదగా అందజేశారు. కనకాయలంకను, గుండెకాయలా ఆదుకున్నారని పడవయజమానులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మలను సత్కరించారు.
పడవ యజమానులకు చెక్కుల పంపిణీ