Telugu News Power

పవన్ కళ్యాణ్ పై వేసిన పిటిషన్ కొట్టేసిన హైకోర్టు.

అమరావతి: మార్చి, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రముఖ నటులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై, మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ వేసిన వ్యాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం కొట్టేసింది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా సందర్భంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, టిక్కెట్ ధర పెంపులో నిబంధనలు పాటించలేదని, మేరకు విచారం జరిపించాలని పిటిషనర్ విజయ్ కుమార్ కోర్టుకు వెళ్లారు. వీరి తరఫున న్యాయవాది బి.బాలయ్య వాదించారు. అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అతను ఏజీ సాంబశివ ప్రతాప్ ప్రభుత్వం తరఫున తమ వాదనలు వినిపిస్తూ, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సినిమాల్లో నటించకూడదని ఎక్కడా నిబంధనలు లేవన్నారు. హరిహర వీరముల్లు సినీ నిర్మాత అభ్యర్థన మేరకు మాత్రమే టికెట్ ధర పపెంచినట్టు వారు కోర్టుకు వివరించారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి, పిటిషన్ కు విచారణ అర్హత లేదని కొట్టివేశారు.