పాలకొల్లు: నవంబర్,30 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక మండలంలోని కాపవరం గ్రామంలో స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఆదివారం సాయంత్రం రైతులకు పశువుల దాణ పంపిణీ చేశారు. గ్రామంలోని సుమారు 60 మంది రైతులకు సగం ధరకే దాణ అందజేశారు. దాణ50 కేజీలు బస్తా అసలు ధర రూ.1110 లు. నియోజకవర్గ పరిధిలో 110 టన్నుల దాన సబ్సిడీపై పంపిణీ చేశారు. ఈ దాణ మొత్తం విలువ 24 లక్షల 42 వేల రూపాయలు. అయితే రైతులకు సగం ధరలో 12 లక్షల 21 వేల రూపాయలకే ఈ దాణ లభించింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోలాటి రాధ,మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు,పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కోడి విజయభాస్కర్, ఎమ్మార్వో వై. దుర్గా కిషోర్, ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, ఏడి డాక్టర్ గేదెల సత్యనారాయణ, పశువైద్యాధికారులు వరప్రసాద్ సుమ,ఎంపీపీ చిట్టూరి కనకమహాలక్ష్మి, జడ్పిటిసి సభ్యులు నడపన గోవిందరాజులు నాయుడు, ఎంపీటీసీ సభ్యులు శైలజ కుమారి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాముల రజిని కుమార్, అంగర చిన్న, గూడూరి నరసింహమూర్తి పలువురు రైతులు కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.