Telugu News Power

పాలకొల్లుకు భారీ విద్యుత్ ప్రాజెక్ట్ -మంత్రి నిమ్మల

భారీ విద్యుత్ కేంద్రం, స్థాపన గురించి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నిమ్మల.

పాలకొల్లు:డిసెంబర్,15 (తెలుగు న్యూస్ పవర్) విద్యుత్ కష్టాలు తీర్చడానికే కాక, భవిష్యత్తు అవసరాల మేరకు 250 కోట్ల భారీ విద్యుత్ కేంద్రం స్థాపించనున్నట్టు, సోమవారం విలేకరుల సమావేశంలో మంత్రి ప్రకటించారు. ఇప్పుడు నిర్మించబోయే విద్యుత్ కేంద్రం 220/33 కెవి సామర్థ్యం కలిగి ఉంటుందన్నారు. పాలకొల్లు పట్టణంలో ప్రస్తుతం ఉన్న 70 మెగావాట్ల విద్యుత్ అవసరాలకు మించి భవిష్యత్తులో ఏర్పడబోయే డిమాండ్ కు తగ్గట్టుగా ఈ విద్యుత్ కేంద్రాన్ని మంజూరు చేయించినట్టు చెప్పారు.అధికారుల నిరంతర కృషితో, ఇందుకోసం లంకలకోడేరు సమీపంలోని వెంకటాపురంలో12.84 ఎకరాలు సేకరించినట్టు మంత్రి తెలిపారు. ప్రస్తుతానికి 160 కోట్లు నిధులు మంజూరు ఉత్తర్వులు వచ్చాయని వెల్లడించారు. తరువాత మిగిలిన 90 కోట్ల నిధులు మంజూరు చేస్తారనన్నారు. ఈ ప్రక్రియ ప్రారంభించడానికి టెండర్లు త్వరలో పిలుస్తారని పేర్కొన్నారు. ఈ విద్యుత్ కేంద్రం పూర్తికావడానికి దాదాపు మూడేళ్ల సమయం పట్టు వచ్చున్నారు. వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తానన్నారు. ఇప్పటికే నాగరాజు పేటలో విద్యుత్ కేంద్రం ఒక్క ఏడాదిలోని పూర్తి చేశామన్నారు. ఎలమంచిలి మండలం మేడపాడులో మరో విద్యుత్ కేంద్రం పనుల త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. గతంలో ఇలపకుర్రు, పెనుమదం, ఆగర్తిపాలెం, మార్కెట్ యార్డ్, పెంకుళ్లపాడు వద్ద విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వైఎస్ఆర్ పార్టీ శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ఐదేళ్లలో ఒక్క కేంద్రం కూడా నిర్మించలేదన్నన్నారు.విద్యుత్ సమస్యలు అధికమయ్యాయన్నారు. భీమవరం, నరసాపురం ఫీడర్ కేంద్రాలపై ఆధారపడి ఉండటం వల్ల తరచూ అంతరాయం కలుగుతుందని వెల్లడించారు. ఇప్పటి విద్యుత్ కేంద్రంలో 80,80 ఫీడర్లు రెండు ఉండటం వల్ల సమస్యలు కనీస స్థాయికి తగ్గించవచ్చునన్నారు. ఇంత భారీ ప్రాజెక్టు పాలకొల్లుకు రావడానికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానందుకు, విద్యుత్ శాఖమాత్యులు గొట్టిపాటి రవికుమార్ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వైఎస్ఆర్ పార్టీని తీవ్రంగా విమర్శించారు.ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, జనసేన నాయకులు చిన్న, టిడిపి నాయకులు గండేటి వెంకటేశ్వరరావు పెచ్చెట్టి బాబు, టిడిపి మండల అధ్యక్షులు పాముల రజిని కుమార్, మామిడిశెట్టిపెద్దిరాజు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.