Telugu News Power

పాలకొల్లుకు రోటరీ గవర్నర్ పదవి.

డాక్టర్ సంజయ్ ను సత్కరిస్తున్న రోటరీ సభ్యులు

విజయవాడ/పాలకొల్లు: మార్చి, 22 (తెలుగు న్యూస్ పవర్. కామ్) అత్యంత ప్రతిష్టాత్మకమైన రోటరీ గవర్నర్ పదవి పాలకొల్లుకు చెందిన ప్రముఖ దంత వైద్యులు ముచ్చర్ల సంజయ్ ను వరించింది. విజయవాడలో ఆదివారం రాత్రి అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఎన్నికల్లో మంచి మెజారిటీతో సంజయ్ విజయం సాధించారు ఈ మేరకు మాంటిసోరి వాసు ముందుగానే సూచన ఇచ్చారు. డాక్టర్ సంజయ్ సుదీర్ఘ కాలంగా రోటరీ క్లబ్ కు విశేషాలు అందిస్తూ గుర్తింపు పొందారు. పాలకొల్లులో ప్రతిష్టాత్మకమైన రోటరీ క్లబ్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా, సంజయ్ కు డాక్టర్ బాబ్జి, మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, పెనుమాక రామ్మోహన్రావు, కానూరి జీ బాబు, మాజీ ఎమ్మెల్యే బంగారు ఉషారాణి, ముత్యాల శ్రీనివాస్, మాంటిసోరి వాసు, రాంప్రసాద్, డాక్టర్ ఆనంద గజపతిరాజు, కిరణ్ గుప్తా, రాజేష్ తదితరులు అభినందనలు తెలియజేశారు.