పాలకొల్లు:డిసెంబర్,16 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు మున్సిపాలిటీ అతి పురాతనమైనది. ఈ మున్సిపాలిటీ ఏప్రిల్ 4, 1919లో ఏర్పాటు అయింది. మొదటి స్థాయి మున్సిపాలిటీగా 1965లో గుర్తించారు. ఇక ఇప్పుడు, పాలకొల్లు మున్సిపాలిటీ ప్రత్యేక మునిసిపాలిటీ స్థాయికి చేరింది. ఈ మేరకు ప్రభుత్వం అసాధారణ గెజిట్ నోటిఫికేషన్ మంగళవారం జారీ చేసింది. మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం 303, ఈనెల 10వ తేదీన చేశారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించారు. మున్సిపాలిటీకి వచ్చిన ఆదాయ వివరాలు 2022 నుంచి 2025 వరకు ప్రభుత్వం పరిశీలించింది. ప్రస్తుత మునిసిపాలిటీ, ప్రత్యేక స్థాయి మున్సిపాలిటీకి కావలసిన అన్ని అర్హతలు సంతృప్తికరంగా ఉన్నట్టు తమ పరిశీలనలో తేలిందని, ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి జి ఓ నెంబర్,271 మంగళవారం ప్రభుత్వం విడుదల చేసింది. పాలకొల్లు పట్టణం 60 వేలకు పైగా జనాభాతో,ఆరు చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఇందువల్ల వచ్చే ప్రయోజనాల గురించి తెలుసుకోవాలని ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
పాలకొల్లు ఇక ప్రత్యేక మునిసిపాలిటీ