Telugu News Power

పాలకొల్లు పంచారామ క్షేత్రంలో కథాకళి నృత్య ప్రదర్శన

శివాలయంలో నృత్య ప్రదర్శన

పాలకొల్లు: డిసెంబర్ 22 (తెలుగు న్యూస్ పవర్) పంచారామ క్షేత్రమైన పాలకొల్లులో సోమవారం రాత్రి కథాకళి నృత్య ప్రదర్శన జరిగింది. శ్రీనివాస కళ్యాణం అనంతరం సోమవారం బ్రహ్మోత్సవ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఈ నృత్య కళాకారులు శివాలయ ప్రాంగణంలో మహాదేవుని ముందు తమ ప్రదర్శన ఇచ్చారు. ప్రతి సోమవారం సాయంత్రం జరుగుతున్న మారేడుదళ సప్త ప్రదక్షణ కార్యక్రమంలో సుమారు 250 మంది భక్తులు పాల్గొన్నారు. రాత్రి స్వామివారికి పంచహారుతుల సేవ జరిపించారు. ఆలయ ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, సభ్యులు పి శ్రీదేవి, ఆలయ పర్యవేక్షకులు పి వాసు, ఆలయ సిబ్బంది,భక్తులు పాల్గొన్నారు.