Skip to main content

Telugu News Power

అంతర్జాతీయ కార్యదర్శిగా ‘ దర్శి’

వాసవి క్లబ్ అవార్డు స్వీకరిస్తున్న దరిశి

పాలకొల్లు: డిసెంబర్, 22 (తెలుగు న్యూస్ పవర్) వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నూతన కార్యదర్శిగా పాలకొల్లు వ్యాపారవేత్త దరిశి శ్రీనివాస గుప్త నియమితులయ్యారు. హైదరాబాద్ క్లాసిక్ కన్వెన్షన్ లో ఆదివారం ఈ నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. గుప్త అదే రో

కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా అభివాదం చేస్తున్న దర్శి శ్రీనివాస గుప్తా

జు జరిగిన, ప్రమాణస్వీకారోత్సవంలో బాధ్యతలు స్వీకరించారు. కొత్త ఏడాది నుంచి వీరి సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 1500 వాసవి క్లబ్ లు ఉన్నాయి. ఈ క్లబ్బుల్లో 80 వేల వరకు సభ్యులు ఉన్నారు. శ్రీనివాస గుప్తా వీరికి ఏడాది పాటు కార్యదర్శిగా తన సేవలు అందించమన్నారు. గతంలో వివిధ హోదాల్లో సమర్థవంతంగా పనిచేసిన గుర్తింపు వీరికి ఉంది. వీరి నియామకం పట్ల పలువురు ఆర్య వైశ్య ప్రముఖులు అభినందనలు తెలియజేశారు.