Telugu News Power

పాలకొల్లు పట్టణ డంపింగ్ యార్డ్ నిర్వహణ రాష్ట్రానికి ఆదర్శం కావాలి – మంత్రి నిమ్మల

పాలకొల్లు: నవంబర్ ,29 (తెలుగు న్యూస్ పవర్)
పాలకొల్లు పట్టణంలో ఉన్న డంపింగ్ యార్డ్ల నిర్వహణ రాష్ట్రంలో ఉన్న ఇతర పట్టణాలకు ఆదర్శంగా ఉండాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మంత్రి తన సుడిగారి పర్యటనలో భాగంగా శనివారం పాలకొల్లు రామయ్య హాలు, ఎడ్ల బజార్ ఉన్న డంపింగ్ యార్డ్ లను మంత్రి పరిశీలించారు. పర్వతాల్లా పేరుకు పోయిన డంపింగ్ యార్డ్ లను మంత్రి అతి కష్టం మీద ఎక్కుతూ దిగుతూ, డంపింగ్ యార్డ్ మెటీరియల్ తరలింపు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. డంపింగ్ యార్డ్ లు ఊరికి,దేవాలయాలకు దగ్గరగా ఉండటం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.రోడ్డుమీదకి ఈ దుర్గంధం వ్యాపించడం ప్రమాదకరంగా ఉందన్నారు. పాలకొల్లు పట్టణంలో ఉన్న ఈ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా డంపింగ్ యార్డ్ తరలింపు పై అధికారులు ప్రత్యేక కృషి చేయాలని ఆదేశించారు.