Skip to main content

Telugu News Power

మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న మంత్రి నిర్మల

మున్సిపల్ కార్యాలయం వద్ద మాట్లాడుతున్న మంత్రి నిర్మల

అభివృద్ధి పనులపై మంత్రి నిమ్మల సమీక్ష
పాలకొల్లు:నవంబర్,29 (తెలుగు న్యూస్ పవర్) ప్రజలు తమపై పెట్టుకున్న ఆశలకు,నమ్మకానికి అనుగుణంగా అధికారులు, ఏజెన్సీలు పనిచేయాలని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పట్టణంలో ప్రస్తుతం వివిధ పథకాల ద్వారా జరుగుతున్న పనుల ప్రగతిని అధికారుల ద్వారా తెలుసుకున్నారు. మున్సిపల్ కార్యాలయం శనివారం ఈ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ పార్థసారథి, వివిధ శాఖల అధికారులు,వారి సిబ్బంది, కూటమి నాయకులు ఉన్నమట్ల కపర్ది, చిన్న, ధనాని సూర్య ప్రకాష్, వట్టం గణేష్ తదితరులు పాల్గొన్నారు.