పాలకొల్లు నవంబరు 17 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు యాడ్లబజార్ సెంటర్లో వేయించేసి ఉన్న అయ్యప్ప స్వామి ఆలయం వద్ద పదునెట్టంబడి పడిపూజ మంగళవారం రాత్రి జరిగింది. ఆలయం 18 మెట్లు పూలమాలతో అలంకరించారు. ఈ పడిపూజ గోటేటి సత్య సుధాకర్ స్వామి మూడవ సారి శబరిమల యాత్రకు వెళుతున్న సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో కలిసి పడిపూజ జరిపించారు. ఈ పడిపూజ చల్లా బాబులు గురుస్వామి, సుబ్రహ్మణ్య చైనులు గురుస్వామి, ఓదూరి నరసింహాయి గురుస్వామి ఆధ్వర్యంలో పడిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి ఆధ్యాత్మిక పాటల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బోనం మునసబు, తోట విజయకుమార్ పలువురు భక్తులు, స్వామి మాలధారులు ఈ పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
