Skip to main content

Telugu News Power

పాలకొల్లు లో అయ్యప్ప స్వామి పడిపూజ

పాలకొల్లు నవంబరు 17 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు యాడ్లబజార్ సెంటర్లో వేయించేసి ఉన్న అయ్యప్ప స్వామి ఆలయం వద్ద పదునెట్టంబడి పడిపూజ మంగళవారం రాత్రి జరిగింది. ఆలయం 18 మెట్లు పూలమాలతో అలంకరించారు. ఈ పడిపూజ గోటేటి సత్య సుధాకర్ స్వామి మూడవ సారి శబరిమల యాత్రకు వెళుతున్న సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో కలిసి పడిపూజ జరిపించారు. ఈ పడిపూజ చల్లా బాబులు గురుస్వామి, సుబ్రహ్మణ్య చైనులు గురుస్వామి, ఓదూరి నరసింహాయి గురుస్వామి ఆధ్వర్యంలో పడిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి ఆధ్యాత్మిక పాటల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బోనం మునసబు, తోట విజయకుమార్ పలువురు భక్తులు, స్వామి మాలధారులు ఈ పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.