Telugu News Power

పాలకొల్లు సుబ్బారాయుడు గుడి వద్ద అఖండ అన్న సమారాధన

అన్న సమారాధనలో మహిళా భక్తుల సహఫంక్తి భోజనం.

పాలకొల్లు:డిసెంబర్,2 (తెలుగున్యూస్ పవర్) స్థానిక సుబ్బారాయుడు గుడి సెంటర్లో వేయించేసి ఉన్న, శ్రీవల్లీదేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్టి ఉత్సవాల సందర్భంగా మంగళవారం అఖండ అన్నసమారాధన కార్యక్రమం జరిగింది. వర్షం వల్ల ప్రతికూల పరిస్థితి ఉన్నా నిర్వాహకులు అనేక ప్రయాసలతో భక్తులకు ఏ లోటు రాకుండా అన్నదాన కార్యక్రమం సజావుగా జరిపించారు. మహిళలకు టేబుల్ మీల్స్ ఏర్పాటు చేశారు. పురుషులకు బఫే భోజనం అందించారు. వర్షంలో కూడా కొందరు భక్తులు గొడుగులు సహా వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. గతంలో లాగే ఈ ఏడాది కూడా, 10 నుంచి12 వేల మంది వరకు ఈ అన్న సమారాధన కార్యక్రమానికి తరలివచ్చారని అంచనా వేస్తున్నారు. ఈ అన్నదానానికి భక్తులైన దాతల నుంచి బియ్యం సేకరిస్తారు. మిగిలిన ఖర్చులన్నీ దేవస్థానం వారే భరిస్తారు.దేవస్థానం కమిటీ అధ్యక్షులు, గుణ్ణం విశ్వేశ్వరరావు,కార్యదర్శి, గుమ్మళ్ళ కృష్ణ , కిట్టయ్య, ఉపాధ్యక్షులు మోపిదేవి అప్పారావు ,యడ్ల నాగేశ్వరరావు, యర్రంశెట్టి సుబ్బారావు, తదితర కమిటీ సభ్యులు, పలువురు వాలంటీర్లు ఈ అన్నదాన కార్యక్రమం తమ సహాయ సహకారాలతో విజయవంతంగా సంపూర్ణం చేశారు.