Telugu News Power

పుట్టినరోజు సందర్భంగా పంచాయతీకి స్వచ్ఛ ఆంధ్ర వాహనం.

పంచాయతీకి స్వచ్ఛభారత్ వాహనం అందజేస్తున్న అంజిబాబు.

యలమంచిలి:డిసెంబర్,12(తెలుగు న్యూస్ పవర్) మండల తెలుగు రైతు అధ్యక్షులు చెరుకూరి రామాంజనేయులు,అంజిబాబు, వారి కుమార్తె పుట్టినరోజు సందర్భంగా స్వచ్ఛ ఆంధ్ర వాహనం సమకూర్చారు. పంచాయతీకి శుక్రవారం ఈ వాహనాన్ని అప్పగించారు. అడవిపాలెం గ్రామానికి స్వచ్ఛ ఆంధ్ర వాహనం లేకపోవడం వల్ల గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఏ కార్యక్రమం జరిగిన అందుకు సంబంధించిన వ్యర్ధాలను తరలించడం కష్టమవుతుంది. పాలకొల్లు నుంచి వచ్చే వాహనాలు ఇక్కడ ఉంచడం లేదు. ఇరుకు సందులు ఉన్న చోటుకు ఈ వాహనం వెళ్లడం వీలుకాదు. అందువల్ల గ్రామస్తుల అవసరాల నిమిత్తం అంజిబాబు, తను, తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా ప్రజా సేవకు ఉపయోగపడే నిర్ణయం మేరకు ఈ వాహనాన్ని తన సొంత నిధుల నుంచి సమకూర్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు తన వంతు సహాయం చేశానన్నారు. గ్రామ అభివృద్ధికి అందరూ తమ శక్తి మేరకు వితరణ ఇవ్వాలని కోరారు. రాష్ట్ర జల వనరుల శాఖమాత్యులు స్థానిక శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు ఈ సందర్భంగా అంజిబాబును అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ గ్రంధి పవన్ కుమార్, యు పి ఆర్ డి జక్కంశెట్టి ప్రసాద్, ఎస్సై గురవయ్య, కార్యదర్శి హరి, మండల తెలుగుదేశం అధ్యక్షులు మామిడిశెట్టి పెద్దిరాజు, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు బోనం నాని, సొసైటీ అధ్యక్షులు బొప్పన హరికిషోర్, చిలుకూరి బాలాజీ, నీటి సంఘం అధ్యక్షులు ఆరమిల్లి రామ శ్రీనివాస్, దీప్తి స్కూల్ అధినేత రావూరి అప్పారావు, బొలిశెట్టి రావులియ్య,స్థానిక బిజెపి నాయకులు పిల్లా గోపి, పోట్టుపోతు శ్రీను, తెలుగుదేశం నాయకులు అంతర్వేది విఘ్నేశ్వర రావు, మాజీ గంధం శ్రీనివాస్, ఉండ్రాజవరం బాబురావు, ఉల్లంపర్తి వెంకటేశ్వరరావు, కాఫీ శెట్టి శ్రీను, కన్ఫాముల శ్రీను, గడ్డం శంకర్, పంచాయతీ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.