Telugu News Power

పూలపల్లి మరకతలింగ మహాక్షేత్రం సందర్శించండి.

అమృత లింగేశ్వరాలయం

-గాంధీ మెగా ఫౌండేషన్ అధ్యక్షులు భగవాన్ రాజు పిలుపు.

పాలకొల్లు: ఫిబ్రవరి, 11(తెలుగు న్యూస్ పవర్) ఫూలపల్లి లో వేంచేసి ఉన్న, శ్రీ శ్రీ శ్రీ అన్నపూర్ణ సమేత అమృత లింగేశ్వర ఆలయాన్ని శివరాత్రి రోజు దర్శించి, తరించవలసినదిగా గాంధీ మెగా ఫౌండేషన్ అధ్యక్షులు, పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ, మాజీ అధ్యక్షులు గాంధీ భగవాన్ రాజు భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం, శివరాత్రి సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు స్వామివారికి రుద్రాభిషేకం, , అమ్మవారికి కుంకుమ పూజలు జరుగుతాయని తెలిపారు. శివరాత్రికి ఆదివారం రాత్రి 7.30 గంటల నుంచి,12 గంటల వరకు బిల్వార్చన, రుద్రాభిషేకం, విశేష ద్రవ్యములతో లింగోద్భవ కాలం వరకు జరపబడును. ఈ సందర్భంగా సూర్య భగవానుడు స్వామి వారిని స్పర్శించే అద్భుత కాంతిని, దర్శించి తరించాలని, ధర్మకర్త దంపతులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, సుశీల దేవి, పూలపల్లి గ్రామ పరిసర వాసులకు విజ్ఞప్తి చేశారు.