పాలకొల్లు: జనవరి,1(తెలుగు న్యూస్ పవర్) కోనసీమ జిల్లా, ఆత్రేయపురం మండలం, వాడపల్లిలో వేంచేసి ఉన్న శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి లో ధర్మకర్తగా పెండ్యాల భవాని నియమితులైనారు. ఈ సందర్భంగా, గురువారం, క్షీరా రామలింగేశ్వర ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు, ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు, పినిశెట్టి చిన్న, ఉప్పులపు, భవానీని సత్కరించారు. అర్చకులు అనిల్, క్రిస్టప్ప, ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్ణయ్య, వీరబాబు, సోమేశ్వరరావు పలువురు ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.